మండలం కల్వచర్ల గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలకు అమృత కలశం పేరిట నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. కన్వీనర్ నూక రమేష్ ప్రతి నెల నలుగురు నిరుపేదలకు ఈ సేవ చేస్తున్నారు.
కల్వచర్ల శ్రీ సత్యసాయి భజన మండలి కన్వీనర్ శ్రీ నూక రమేష్ ప్రతి నెల నలుగురు నిరుపేదలకు అమృత కలశాల పేరిట నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. గత 26 సంవత్సరాలుగా సత్యసాయి భక్తుడిగా పలు సమితులకు కన్వీనర్ గా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన, 42 సంవత్సరాల సింగరేణి ఉద్యోగ విరమణ అనంతరం తన స్వగృహమైన కల్వచర్లలోని సాయి నిలయంలో శ్రీ సత్యసాయి భజన మండలిని, సత్యసాయి బాలవికాస్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల కూడా కల్వచర్లకు చెందిన నిరుపేదలైన రొడ్డ లక్ష్మి, తుమ్మెటి కవిత, బూస శంకరమ్మలకు తన నివాసమైన సాయి నిలయంలో అమృత కలశం పేరిట నిత్యావసర సరుకుల సంచులను అందజేశారు. ఈ సేవ ద్వారా పేద కుటుంబాలకు కొంతమేర ఆసరా లభిస్తోంది. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు మాజీ జెడ్పీటీసీ గంట వెంకట రమణారెడ్డి, కొలిపాక సారయ్య, మేకల మారుతీ, గుండ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. వారు నూక రమేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా అమృత కలశాలు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ, దేవుని పేరిట తమకు నిత్యావసర సరుకులు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. సత్యసాయి కృపతో రమేష్ గారి కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.










