వేడుక
8 ఇంక్లైన్ కాలనీ (అక్షరజ్యోతి ప్రతినిధి): 8వ కాలనీ, హనుమాన్ నగర్ లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద 18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించిన కార్పొరేటర్ చక్రపాణి, ఆలయ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు నరేష్, మల్లేష్, క్రాంతి, రాఘవేంద్ర, అనిల్, రజినీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.










