దసరా వేడుకలు
పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన ఆయుధ, జమ్మి, వాహన పూజా కార్యక్రమాలలో పోలీసు కమీషనర్ గౌష్ ఆలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ కమీషనరేట్ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కమీషనరేట్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ఆకాంక్షించారు.
అధికారుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రిజర్వు ఇన్స్పెక్టర్లు జానీమియా, శ్రీధర్ రెడ్డి, కిరణ్ కుమార్ లతో పాటు ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.











