జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశం పితృమూర్తి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాజలింగం (85) కన్నుమూత
ముత్తారం/ తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల కోటేశం పితృమూర్తి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పరికిపండ్ల రాజలింగం (85) మృతి పట్ల సంఘం రాష్ట్ర, జిల్లా నాయకత్వం తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. గత రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజలింగం, వృద్ధాప్య సమస్యల కారణంగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ముత్తారంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రాజలింగం మరణవార్త తెలిసిన వెంటనే తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు ఫోన్ ద్వారా జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశంని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వాట్సాప్ ద్వారా ప్రత్యేక సంతాప సందేశాన్ని పంపించారు.
విషయం తెలుసుకున్న జిల్లా కమిటీ నాయకులు ముత్తారంలోని కోటేశం స్వగృహానికి చేరుకుని, రాజలింగం పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ నివాళులర్పించిన వారిలో జిల్లా అధ్యక్షులు కొలిపాక సారయ్య, రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి డా.దుబాసి విష్ణుమూర్తి, జిల్లా కోశాధికారి కొలిపాక నగేష్, జిల్లా ఉపాధ్యక్షులు తాటికొండ వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి అనుమాండ్ల రాజశేఖర్, ప్రాథమిక సభ్యులు బూర్ల రాజేందర్, ఇప్పనపల్లి మధుకర్, బుజారపు సంపత్, దొంతుల సురేష్, జిల్లా మినిస్ట్రియల్ స్టాఫ్ అధ్యక్షులు రంగు రవి, సూపరిండెంట్ సురేష్, మాజీ ఎంపీవో గోవర్ధన్ తదితర ముఖ్య అధికారులతో పాటు పద్మశాలి నాయకులు గూట్ల రమేష్, చిలకాని సారయ్య, చిందం సదానందం, గడ్డం విద్యాసాగర్, నల్లాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రాజలింగం ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.










