పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ (పిపిసి)లో భాగంగా, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కన్నాల గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ ఎంజిఎన్ఆర్జిఏ పథకాల ద్వారా గ్రామాభివృద్ధికి చేపట్టే పనుల గురించి వివరించారు. మంథని ఎస్ఐ. ఎన్. సందీప్ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామసభకు ముందు గ్రామ టోపోగ్రాఫికల్ మ్యాప్‌ను ప్రదర్శించారు. అనంతరం సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్జిఏ) ద్వారా గ్రామానికి అవసరమైన రోడ్లు, కుంటలు, చెరువుల మరమ్మతులు, ఇంకుడు గుంతలు, డ్రైనేజీలు, రైతులకు పొలం కుంటలు, పొలాలకు నీటి కాలువలు, ఫామ్ పాండ్స్, బావులు వంటి 375 రకాల పనులు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి కుటుంబానికి 125 రోజుల పని దినాలు కల్పించవచ్చని, ఐ-ఎన్-ఐ-ఎన్-ఓ ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోకుండా ఎంజిఎన్ఆర్జిఏ ద్వారా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని సూచించారు. కార్మికులు అధిక మొత్తంలో పాల్గొనడం ద్వారా వచ్చే మెటీరియల్ పేమెంట్‌తో గ్రామ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంథని ఎస్ఐ. ఎన్. సందీప్, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుతాయని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సదానందం, ఉప సర్పంచ్ శ్రీమతి గాదే దివ్య, వార్డు సభ్యులు రామగిరి సంపత్, వంగల కీర్తన, ముసుకుల కృష్ణవేణి, తోట శ్రావణ్, పర్షవేన అనిల్, అంగన్వాడి టీచర్లు, ఆశ కార్యకర్త పుష్ప, టీఏ, ఎఫ్ఏ, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.










