రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా సన్మానం
గోదావరిఖని/పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన అనంతుల రాజును రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ శుక్రవారం స్థానిక క్యాంప్ ఆఫీసులో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర నాయకత్వం స్థానికుడిని గుర్తించి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పలువురి మన్ననలు పొందుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి, 52వ డివిజన్ కార్పొరేటర్ చిదురాల నాగరాజు, మూడో వార్డు కార్పొరేటర్ వడ్లూరి రవి, గోదావరిఖని పట్టణ అధ్యక్షులు వేనిశెట్టి నటరాజశేఖర్, చీఫ్ అడ్వైజర్ అల్లంకిలచ్చయ్య, పెద్దపల్లి డివిజన్ చైర్మెన్ యాద వెంకటరమణ రాముడు, తాటిపల్లి దేవయ్య, వెంకట ముత్యం, వేనిశెట్టి వీరన్న, చంద సంతోష్, ముస్త్యాల సంతోష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేకల అజయ్, పూజారి రాకేష్, బొల్లం రాజు, సాధుల రాజేష్, కొండ అక్షయ్ పాల్గొన్నారు.










