కార్మికుల సమస్యలపై చర్చ, ఐక్య కూటమికి మద్దతుగా విజ్ఞప్తి
ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖని డిపోను జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరు రాజరత్నం సందర్శించారు. ఆర్టీసీ కార్మికులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డ్యూటీ, ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్య సెలవులు (సిక్ పే), జీతాలు, పీఆర్సీ వంటి విషయాలపై కార్మికులతో చర్చించి, వారి స్థితిగతులను తెలుసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికుల ఉనికిని కాపాడాలని, ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నప్పటికీ కార్మికులను తగ్గించే ప్రయత్నం చేయకూడదని ఆయన వివరించారు. కావున, తొమ్మిదో తేదీన జరిగే ఎన్నికలలో ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ బలపరిచిన ఐక్య కూటమిని గెలిపించాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ సిహెచ్.బాబు, సెక్రటరీ గుడికందుల శ్రీనివాస్, టీఎంయూ సెక్రటరీ వంగర శ్రీనివాస్, టిఆర్. రెడ్డి, ఎన్.ఎం.యు సెక్రటరీ మాతంగి తిరుపతితో పాటు తదితరులు పాల్గొన్నారు.












