సంక్షేమం
తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకునే విశిష్టమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మహిళా సంతోషంగా పండుగను జరుపుకోవాలనే మంచి ఉద్దేశంతో, ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ చీరలను అందజేసే పథకానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆదివారం నాడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో స్థానిక మహిళలకు ఇందిరమ్మ చీరలను ఘనంగా పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యులు గౌరవ రాజ్ ఠాగూర్ ప్రత్యేక ఆదేశాల మేరకు, 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ-మల్లేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, ఇందిరమ్మ కాలనీలోని మహిళలందరికీ చేతుల మీదుగా బతుకమ్మ చీరల కానుకలను అందజేశారు.
తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ అత్యంత ప్రీతిపాత్రమైనదని, మహిళల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకత్వంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామని, కాలనీలోని ప్రతి పేద కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పండుగ వేళ తమకు ప్రత్యేక శ్రద్ధతో చీరలను పంపిణీ చేసినందుకు గాను గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి, 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ-మల్లేష్ కు ఇందిరమ్మ కాలనీ మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.












