డ్రిల్ బీట్లు, రాడ్ల సమస్యల పరిష్కారం వెంటనే చేపట్టాలని యాజమాన్యానికి సూచన; నూతన కమిటీ ఎన్నిక
వకీల్ పల్లి పిట్ కమిటీ సమావేశం బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిడి మహేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతితులుగా కేంద్ర కార్యదర్శి రాజరత్నం, బ్రాంచ్ కార్యదర్శి గంధం సాంబశివరావు గారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీయూసీ 24 సమస్యలపై అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని, వాటిపై వెంటనే సర్క్యులర్లు జారీ అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. మైన్ లో డ్రిల్ బీట్లు, డ్రిల్ రాడ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూతన పిట్ సెక్రటరీగా రోహిత్ రెడ్డి, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలుగా రాకేష్, నితీష్ కుమార్లను ఎన్నుకున్నారు. పిట్ కమిటీ సలహాదారుగా ఎర్రల విజయ్, ఉపాధ్యక్షులుగా అజయ్ రెడ్డి, ఆర్జి 2 ఏరియా ట్రేడ్స్ మెన్ ఇన్చార్జిగా మాధవ్, వకీల్ పల్లి ట్రెడ్స్ మెన్ ఇన్చార్జిగా మహేష్, రిలే ఏ ఇన్చార్జిగా అర్జున్, రిలే బి ఇన్చార్జిగా శ్రీను, రిలే సి ఇన్చార్జిగా రవీందర్, రిలే డి ఇన్చార్జిగా ప్రమోద్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్త కమిటీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుంటుందని బ్రాంచ్ సెక్రటరీ సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు.












