3 రోజుల్లో పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశం.. దరఖాస్తుదారుడు ఎల్క సదానందం
మీ సేవా కేంద్రాల తనిఖీలో సూచించిన సూచనలకు సంబంధించి, ఆర్.టి.ఐ ద్వారా కలెక్టరేట్ లో దరఖాస్తు చేయగా సమాచారం ఇవ్వనందున, రాష్ట్ర సమాచార కమిషనర్ 6/1/26 తేదీన కమిషన్ ఎదుట హాజరుకావాలని ఈ.డి.ఎం. సూపరింటెండెంట్ కి నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, దరఖాస్తుదారుడైన ఎల్క సదానందం ఈరోజు కమిషన్ వద్దకు వెళ్లగా, సూపరింటెండెంట్ హాజరై 3 రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తామని తెలిపారు. కమిషనర్ 3 రోజులు సమయం అడగగా, అందుకు అంగీకరిస్తూ, పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికైనా సమాచారం అందుతుందని ఎల్క సదానందం ఆశాభావం వ్యక్తం చేశారు.












