జెన్కో, ట్రాన్స్‌కోల నుండి రావాల్సిన 59 వేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని కార్మికుల డిమాండ్
గోదావరిఖని/పెద్దపల్లి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర ఆఫీస్ బేరర్స్, బ్రాంచ్ నాయకుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు, సోమవారం జెన్కో, ట్రాన్స్‌కోల నుండి సింగరేణికి రావాల్సిన సుమారు 59 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఆర్జీ-2లోని ఓసిపి త్రీ సి.హెచ్.పి, బేస్ వర్క్ షాప్, ఎస్ అండ్ ఐ, ఆర్జీ-2 వర్క్ షాప్, సెవెన్ ఎల్.ఈ.పి, ఓసి-3 స్టోర్స్, ఎం.ఎం స్టోర్స్‌లలో మేనేజర్, హెచ్.ఓ.డిలకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యదర్శి రాజరత్నం, బ్రాంచ్ కార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ, సింగరేణికి వచ్చిన లాభాలను ప్రకటించి, కార్మికులకు 40 శాతం వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సింగరేణికి ఎలాంటి బకాయిలు లేకపోయినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ జోక్యం పెరగడం వల్ల సుమారు 26 వేల కోట్ల రూపాయలు బకాయి పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పాటు చేసిన జైపూర్ థర్మల్ ప్లాంట్ ను, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఉత్పత్తి అవుతున్న విద్యుత్ కు సంబంధించి ఒక్క రూపాయి కూడా కంపెనీకి రాకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం సింగరేణి విషయంలో చేతులు పెడితే, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళ్లు పెట్టినట్లుగా సింగరేణి బకాయిలు 59 వేల కోట్లకు పెరిగాయి.
కంపెనీలో కొత్త మిషనరీ, స్పేర్ పార్ట్స్ కొనడానికి డబ్బులు లేక చాలా అవస్థలు పడుతున్నారు. కనీసం సేఫ్టీ షూలు, డ్రస్సులు కూడా కొనలేని పరిస్థితి ఉంది. అలాగే, కార్మిక సంక్షేమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న క్వార్టర్లకు కనీస మరమ్మత్తులు చేయకుండా, కాలనీలోని రోడ్లు డ్యామేజ్ అయినా సరిచేయకుండా, డబ్బులు లేవని చెబుతున్నారు. కావున, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని జెన్కో, ట్రాన్స్‌కోల నుండి రావాల్సిన 59 వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో భాగంగానే ఈరోజు ఆర్జీ-2లో మెమోరాండం అందజేశారు. అలాగే, ఈనెల 13వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టి, విద్యుత్ సౌధ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు అన్నా రావు, సహాయ కార్యదర్శులు శాంసన్, కేంద్ర కార్యదర్శి కందుకూరి రాజరత్నం, మోటపలుకుల మహేందర్, రవికుమార్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు బుర్ర తిరుపతి, సంపత్, పిట్ కార్యదర్శులు మహేందర్, శంకర్, రోహిత్ రెడ్డి, నారాయణ, కుమారస్వామి, వెంకటేష్, అనిల్, నాయకులు రమేష్, కృష్ణ, రాజు, గట్టయ్య, కొమురయ్య, సతీష్, సదయ్య, వేణు, సంపత్, సాంబశివరావు, కుమార్, శ్రీధర్, మల్లేష్, సదరి రమేష్, అలివెల్లి శ్రీనివాసరెడ్డి, షిఫ్ట్ ఇంచార్జిలు ఈరవేణి కొమరయ్య, కైత సతీష్, అగ్గు శ్రీనివాస్, 3షిఫ్ట్ ల ఇన్చార్జ్ మాథ్యూ సాంసన్, కొయ్యడ వేణు, వీరస్వామి, బండారి మల్లేష్, కుమ్మరి శ్రీనివాస్, చింతల మురళి, రాంప్రసాద్, ఆరెపల్లి తిరుపతి, జూపాక కుమార్, స్వామి, సదయ్య, పుల్లూరు శ్రీనివాస్, సారంగం, గాజుల మల్లయ్య, పల్లె రాజిరెడ్డి, మాదాసి మల్లయ్య, ఆరకాల రవీందర్, గాజుల వీరస్వామి, దాముక శ్రీనివాస్, లింగాల కృష్ణ, తంగళ్ళపల్లి వెంకటస్వామి, చంద వేణుగోపాల్, తాటికొండ వెంకటేశ్వర్లు, ఈదుల్ నరసయ్య, దగ్గు చంద్రయ్య, శ్రీనివాస్, బంజారా గట్టయ్య, అనిల్ శ్రీనివాస్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












