ఐ.సి.టి.సి కౌన్సిలర్ కట్కూరి శంకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ
తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశానుసారం మాస్ కాంపెయిన్ లో భాగంగా, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఐ.సి.టి.సి కౌన్సిలర్ కట్కూరి శంకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోదావరిఖని రెడ్ రిబ్బన్ క్లబ్, స్పోర్ట్స్ క్లబ్, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ల సంయుక్త సహకారంతో ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజేతలైన విద్యార్థులకు మొదటి బహుమతిగా జే.భరత్ కు 1000 రూపాయలు, రెండవ బహుమతిగా ఎ.ఈశ్వర్ కు 500 రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆచార్య జై కిషన్ ఓఝా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సాంబశివరావు, డా. సుబ్బారావు, డా. నరేష్, డా. అజయ్ కుమార్, డా. కిరణ్మయి, డా. సతీష్ లతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.












