విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత పెంపునకు పథకం దోహదం: కార్పొరేటర్ మారేల్లి సుశీల-రాజిరెడ్డి
గోదావరిఖని/పెద్దపల్లి: మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాగూర్, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని 19వ డివిజన్ కార్పొరేటర్ మారేల్లి సుశీల-రాజిరేడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని 19వ డివిజన్ అల్లూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ప్రవేశపెట్టారని స్థానిక కార్పొరేటర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. నాణ్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, చదువుపై ఏకాగ్రత పెరిగి విద్యాభ్యాసంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యకరమైన ఎదుగుదల, పాఠశాలల్లో హాజరు శాతం పెంపు, విద్యపై ఆసక్తిని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ భాగ్య సుధ, 8వ కాలని పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్, కొండగట్టు మాజీ డైరెక్టర్ జక్కుల దామోదర్, 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము రాములు, 20వ డివిజన్ ఇంచార్జ్ బండ రమేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మార్కరాజు, 8వ కాలనీ పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేకల అజయ్, బీసీ సెల్ అధ్యక్షులు మెరుగు రాజేశం, బొల్లం రాజు, పూజారి రాకేష్, సాధుల రాజేష్, సిరికొండ అక్షయ్, ఓరుగంటి సతీష్, బాధే రాజు, దుర్గం పోశం, బండి వేంకట్ రాజం, బొల్లం రణదీప్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థినులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












