హన్మకొండ,సెప్టెంబర్03(అక్షరజ్యోతి ప్రతినిధి): సుభేదారి కాకతీయ హైస్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు, కరెస్పాండెంట్ దామెరుప్పుల శంకర్ అధ్యక్షత (అక్షరజ్యోతి ప్రతినిధి): హన్మకొండలోని కాకతీయ హైస్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరెస్పాండెంట్ మరియు సోషల్ జస్టిస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దామెరుప్పుల శంకర్ అధ్యక్షత వహించగా, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు ఏశబోయిన సాంబయ్య యాదవ్ మాట్లాడుతూ కంసుని అంతం శ్రీకృష్ణుని చేత జరుగుతుందని ప్రజావాణి ద్వారా తెలుసుకున్న కంసుడు దేవకీ వసుదేవుల 8వ సంతానాన్ని చంపాలని ఎన్ని కుట్రలు పన్నినా విఫలమయ్యాడని, శ్రావణ అష్టమి రోజు జన్మించిన శ్రీకృష్ణుడు పూతన వంటి రాక్షసులను సైతం అంతం చేశాడని తెలిపారు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ ధర్మం, న్యాయం, పాండవుల హక్కులు మరియు కురుపాండవుల మధ్య ఐక్యత కోసమే కృషి చేశాడని, కానీ దుర్యోధనుడి అహంకారమే మహాభారత యుద్ధానికి కారణమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ వేదిక గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు జున్ను సదానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల పెద్దరవి తదితరులు పాల్గొన్నారు.
కాకతీయ హైస్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
Share:

సారాంశం
సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు దామెరుప్పుల శంకర్ వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు
ముఖ్య విషయాలు
- హన్మకొండ,సెప్టెంబర్03(అక్షరజ్యోతి ప్రతినిధి): సుభేదారి కాకతీయ హైస్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు, కరెస్పాండెంట్ దామెరుప్పుల శంకర్ అధ్యక్షత (అక్షరజ్యోతి ప్రతినిధి): హన్మకొండలోని కాకతీయ హైస్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు ఏశబోయిన సాంబయ్య యాదవ్ మాట్లాడుతూ కంసుని అంతం శ్రీకృష్ణుని చేత జరుగుతుందని ప్రజావాణి ద్వారా తెలుసుకున్న కంసుడు దేవకీ వసుదేవుల 8వ సంతానాన్ని చంపాలని ఎన్ని కుట్రలు పన్నినా విఫలమయ్యాడని, శ్రావణ అష్టమి రోజు జన్మించిన శ్రీకృష్ణుడు పూతన వంటి రాక్షసులను సైతం అంతం చేశాడని తెలిపారు.
- శ్రీకృష్ణుడు ఎప్పుడూ ధర్మం, న్యాయం, పాండవుల హక్కులు మరియు కురుపాండవుల మధ్య ఐక్యత కోసమే కృషి చేశాడని, కానీ దుర్యోధనుడి అహంకారమే మహాభారత యుద్ధానికి కారణమైందని వివరించారు.
- ఈ కార్యక్రమానికి కరెస్పాండెంట్ మరియు సోషల్ జస్టిస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దామెరుప్పుల శంకర్ అధ్యక్షత వహించగా, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు.
