మండలం కన్నాల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో స్వయం సహాయక సంఘాల మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉల్లాస్ కార్యక్రమం నిర్వహించారు. మహిళా సంఘాల అభివృద్ధికి అక్షరాస్యత అత్యవసరమని గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ తెలిపారు.
స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి ఒక్క మహిళ అక్షరాస్యురాలిగా ఉన్నప్పుడే సంఘాలు మరింత అభివృద్ధి చెందుతాయని గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయని తెలిపారు. ప్రతి ఒక్క మహిళ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అక్షరాస్యులుగా మారాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్, సీఏ కోమలత, మహిళా సంఘ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మహిళలు తమ జీవితాల్లో విద్యా ప్రాముఖ్యతను గుర్తించి, అక్షరాస్యతను పెంపొందించుకోవాలని అధికారులు ఆకాంక్షించారు.












