జిల్లా అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా సర్పంచ్ కి ప్రశంసా పత్రం అందజేత
పెద్దపల్లి జిల్లాలో టీబీ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు ఫలించాయి. మండలంలోని పెంచికల్ పేట గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా ప్రకటించడం జరిగింది. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉదయం నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ పల్లె మాధవి-నారాయణలకు ప్రశంసా పత్రం అందజేశారు. పెంచికల్ పేట గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దడంలో గ్రామస్తులు, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక నాయకుల కృషి ప్రశంసనీయం. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఆరోగ్య శాఖ సూచనల మేరకు గ్రామంలో టీబీ వ్యాధి నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించడం, సకాలంలో వైద్య సేవలు అందించడం, చికిత్స పూర్తి చేసేలా పర్యవేక్షించడం వంటి కార్యక్రమాలతో ఈ ఘనత సాధించారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మరిన్ని గ్రామాలను టీబీ రహితంగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెంచికల్ పేట గ్రామం ఒక ఆదర్శంగా నిలుస్తుందని, ఇతర గ్రామాలు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు వస్తాయని ఆశిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టీబీ నిర్మూలనకు నిరంతరాయంగా కృషి చేస్తామని అధికారులు తెలిపారు.












