అందజేసిన ఒకటో డివిజన్ కార్పొరేటర్ మడిపల్లి విజయ-మల్లేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ పికె రామయ్య కాలనీకి చెందిన డాంగి సంతోష్ ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడి, వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మంజూరైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, స్థానిక గౌరవ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ చేతుల మీదుగా బాధితుడు డాంగి సంతోష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంతోష్ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నాము. పేదల సంక్షేమానికి, వారి ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి, చెక్కు మంజూరుకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు, చెక్కును అందజేసిన కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ కు డాంగి సంతోష్, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.












