డీఎస్పీ వహీదుద్దీన్ ప్రారంభించిన శిబిరంలో పలువురు వైద్యులు ప్రజలకు సేవలందించారు
కాగజ్ నగర్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని అగ్రేసేన్ భవన్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. మంచిర్యాలకు చెందిన మెడిలైఫ్ ఎండీ ఫిజీషియన్ డా. చేతన్ చౌహాన్ ఆధ్వర్యంలోని వైద్య బృందం ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం కొనసాగింది.
ఈ శిబిరంలో కార్డియాలజీ డా. సురేంద్ర, పల్మనాలజీ డా. కుమారస్వామి కౌటం, యూరాలజీ డా. అభినయ్ కుమార్, ఆర్థోపెడిక్స్ డా. శ్రీధర్, గైనకాలజీ డా. ప్రసన్నకుమారి, జనరల్ సర్జరీ డా. చంద్రబోస్, రేడియాలజీ డా. ఎస్. శ్రీనివాస్, డెంటల్ డా. స్వప్నిక తదితర వైద్యులు సేవలందించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, వ్యాపారస్తులు చిలువేరు సత్యనారాయణ, మర్చంట్ అసోసియేషన్ సభ్యులు కొసనగొట్టు వెంకటరమణ, మహేష్ లోయా, అరుణ్ అగర్వాల్, కొడిప్యాక రవీందర్, హరి సోని, హితేష్ అగర్వాల్, లెక్చరర్లు డీ. దేవేందర్, చిప్ప సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.












