దాత పాండ్రాల రాజు రూ. 1.11 లక్షల విరాళంతో ఏర్పాటు
పెద్దపల్లి జిల్లా కమాన్ మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ ఆదివారం స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం లడ్డు ప్రసాదం కౌంటర్ ను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన పాండ్రాల రాజు ఈ లడ్డు కౌంటర్ ఏర్పాటుకు రూ. 1,11,116 విరాళంగా అందజేశారు. ఆదివారం దాత పాండ్రాల రాజు చేతుల మీదుగా ఆలయ కమిటీ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఆలయ కమిటీ డైరెక్టర్లు పిల్లి రాజు బుస, శ్రీనివాస్, అనవేన శ్యామల, సది, మల్యాల మల్లేష్, కొంతం శ్రీనివాస్ సమక్షంలో రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు. భక్తులకు ప్రసాదం టిక్కెట్లను అందజేసి, లడ్డు ప్రసాదాలను పంపిణీ చేశారు. లడ్డు ప్రసాదం కౌంటర్ ఏర్పాటుకు విరాళం అందజేసిన దాత పాండ్రాల రాజును చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఆలయ కమిటీ డైరెక్టర్లు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషన్ రెడ్డి, శవ శంకర్, రెబల్ రాజ్ కుమార్, గడ్డం రాజమహేందర్ తదితరులు పాల్గొన్నారు.












