పెద్దపల్లి పట్టణంలో అక్రమంగా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను టాస్క్ఫోర్స్, టౌన్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. భూమ్నగర్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. వారి వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ కమిషనర్ ఆదేశాల న పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూమ్నగర్ ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా మూడు ముక్కలాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం పోలీసులకు అందింది. ఈ సమాచారం ఆధారంగా నార్కోటిక్ టీమ్/టాస్క్ఫోర్స్ ఏసీపీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్ఐ దీకొండ రమేష్, టాస్క్ఫోర్స్ సిబ్బంది మరియు పెద్దపల్లి టౌన్ పోలీసులు కలిసి భూమ్నగర్లో సంయుక్తంగా దాడి నిర్వహించారు.
ఈ దాడిలో మూడు ముక్కలాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 52 ప్లేయింగ్ కార్డులు, రూ.28,120 నగదు, 7 మొబైల్ ఫోన్లు మరియు 1 స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురు వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు.












