*వైఎస్సార్ దూరమై 17 ఏళ్లు*
*2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మృతి*
అమరావతి,సెప్టెంబర్02(అక్షరజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి నేటికి 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు. ప్రతికూల వాతావరణం వల్ల నల్లమల అడవుల్లోని రుద్రకొండపై హెలికాప్టర్ కూలిపోయింది. సుమారు 24 గంటల ఉత్కంఠ, భారీ ఆపరేషన్ తర్వాత సెప్టెంబర్ 3న హెలికాప్టర్ శిథిలాలు, మృతదేహాలను గుర్తించారు. వైఎస్సార్ మరణంతో ఆయన అభిమానులు దుఃఖంలో మునిగిపోయారు.









