సొంత ఇంటి పథకం, పెరిక్స్ అలవెన్స్ వంటి హామీల అమలుపై కార్మికులకు భరోసా
సింగరేణి కార్మికులకు ఆరు గ్యారంటీల అమలులో భాగంగా సొంత ఇంటి పథకం, పెరిక్స్ పైన అలవెన్స్ తో పాటు తదితర ఎన్నికల హామీలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఆర్జి-2 ఏరియాలోని ఓసిపి-3 బేస్ వర్క్ షాప్ లో ఐఎన్టియుసి శ్రేణులు టపాకాయలు కాల్చి, సీట్లు పంపిణీ చేసి కార్మికులతో కలిసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.
బేస్ వర్క్ షాప్ అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ బొంత తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్జి-2 వైస్ ప్రెసిడెంట్ కొత్త సత్యనారాయణ రెడ్డి, జనరల్ సెక్రెటరీ ఎండి అక్రమ్ మాట్లాడుతూ, గత అనేక దశాబ్దాలుగా ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్న సొంత ఇంటి కల, అదే విధంగా పెరిక్స్ పైన అలవెన్స్ తరహా సాహసోపేత హామీలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు.
గత పాలకులు హామీలు ఇచ్చి కార్మికులను వంచించారని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మికవర్గ పార్టీ అని వారు అభివర్ణించారు. సింగరేణి కార్మికవర్గం కాంగ్రెస్ పార్టీని, ఐఎన్టియుసిని ఆదరించాలని వారు కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కొత్త సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అక్రమ్, బొంత తిరుపతి, బర్ల రవీందర్, దిలీప్, అశోక్, సత్యనారాయణ, రమేష్, శ్రీనివాస్, అంజయ్య, చంద్రశేఖర్ తో పాటు పెద్ద ఎత్తున యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












