రాజకీయ
బిజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి, రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ కందుల సంధ్యారాణి సూచనల మేరకు, బిజెపి లేబర్ సెల్ జిల్లా కన్వీనర్ తడగొండ నర్సయ్య ఆధ్వర్యంలో, లేబర్ సెల్ జిల్లా కో-కన్వీనర్ ఎల్తూరి రాజయ్య, 8వ కాలనీ మండల అధ్యక్షులు ఆకుల శశికుమార్ చేతుల మీదుగా 8వ కాలనీ లేబర్ సెల్ కన్వీనర్‌గా కంచర్ల రాజేశంకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో 8వ కాలనీ మండల ప్రధాన కార్యదర్శి ఆకుల కుమార్ గౌడ్, లేబర్ సెల్ జనగామ మండల కన్వీనర్ బియ్యాల మహేందర్, లక్ష్మీనగర్ మండల కన్వీనర్ వీరబోయిన శ్రీనివాస్ యాదవ్, తిలక్ నగర్ మండల కన్వీనర్ జక్కుల ప్రవీణ్, ఎన్.టీ.పీ.సీ. మండల కన్వీనర్ ఎరుకొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.












