సుల్తానాబాద్, 5 October
ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం
స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ ముద్దుబిడ్డ కాకా గడ్డం వెంకట స్వామి 97వ జయంతిని పురస్కరించుకొని, సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు మాట్లాడుతూ, కాకా గడ్డం వెంకట స్వామి నిస్వార్థ సేవలను కొనియాడారు. గడ్డం వెంకట స్వామి ప్రజా జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని పొందారని, ఆయన ప్రజల పక్షాన నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని విజయరమణ రావు తెలిపారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












