గోదావరిఖని, 6 October
ఆర్జీ-2 జనరల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేత; పారదర్శకత లేకుంటే ఉద్యమం తీవ్రతరం
గోదావరిఖని/పెద్దపల్లి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన ఆర్జీ-2 జనరల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. సంస్థ సాధించిన వాస్తవ లాభాలను ఎలాంటి దాపరికం లేకుండా వెంటనే వెల్లడించాలని, ఈసారి కార్మికులకు 36 లాభాల వాటా చెల్లించాలని వారు కోరారు.
కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలంటే లాభాల లెక్కింపులో పారదర్శకత అవసరమని, యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు చెరుకు ప్రభాకర్ రెడ్డి, ఐ. సత్యం, భేతి చంద్రయ్య, బొడ్డు రమేష్, రవితేజ, మార్క్ నరేష్, ముసుకుల అనిల్ రెడ్డి, హరి ప్రసాద్, మామిడి తిరుపతి, దాసరి శ్రీనివాస్, వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, గుజ్జుల రాజేందర్ తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












