మహిళా మోర్చా ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో కార్యక్రమం; ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలకు సన్మానం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 25 సంవత్సరాల పాలన సందర్భంగా సేవ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వడ్డేపల్లి భారతి ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం మల్యాలపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి కందుల సంధ్య రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలను సన్మానించారు. అలాగే గర్భిణీలకు శ్రీమంతం చేయించి, పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుల్వ పద్మ, ఉపాధ్యక్షురాలు చల్ల శోభా రెడ్డి, ఎల్తూరి సరిత, కార్యదర్శి పరకాల శ్రీలత, మండల అధ్యక్షురాలు మినుగు మనోహర, అపర్ణ, బీజేపీ నాయకులు ఎల్తూరి రాజయ్య, కందుల పోశం, కళ్యాణ్, బాలు, వికాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.












