అందించాలి (అక్షర జ్యోతి) అక్టోబర్ 02
మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, నేటి సమాజంలో మనందరం తొందరగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నామని, గాంధీ జీవితంలో ఎప్పుడూ షార్ట్ కట్స్ వెతుక్కోలేదని, న్యాయబద్ధంగా ఓపికతో పోరాడుతూ అనేక విజయాలు సాధించారని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా, విదేశీ వస్త్రాల బహిష్కరణ మొదలగు ఉద్యమాలు ఒక్కరోజులో వచ్చినవి కావని, గాంధీ మహనీయులు ప్రతి రోజూ నమ్మిన సిద్ధాంతం ప్రకారం నిరంతరాయంగా చేసిన కృషి ఫలితంగా ఉద్యమాలు సఫలీకృతం అయ్యాయని, ఒక్కరోజులో ఫలితం రాలేదని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ జైలు శిక్ష అనుభవించడం వంటి అనేక కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, లక్ష్యాన్ని, సిద్ధాంతాన్ని మరిచిపోకుండా పోరాటం సాగించారని, దాని వల్ల ఆశించిన ఫలితం లభించి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, దీనిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, నిరంతరాయంగా లక్ష్యం కోసం శ్రమిస్తే ఫలితం లభిస్తుందని తెలిపారు. మన నిత్య జీవితంలో అనేక ఒత్తిడులు వస్తాయని, అటువంటి అవరోధాలను ఎదుర్కొంటూ మన లక్ష్యాల సాధనకు నిరంతరాయంగా శ్రమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ బండి ప్రకాష్, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.












