పెద్దపల్లి, 30 October
క్రీడలు
సింగరేణి ఆర్జీ-3, ఏపీఏ ఏరియా కేంద్రం, సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో శుక్రవారం ఏరియా స్థాయి అథ్లెటిక్ పోటీలలో భాగంగా 3 కిలోమీటర్ల సైకిల్ రేస్ నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం 6 మంది పాల్గొన్నారు.
ఈ పోటీలో ఓసీ-1 గని సేఫ్టీ విభాగ ఉద్యోగి కాంటెవాడ బుగ్గాజీ ప్రథమ స్థానంలో నిలిచి రీజియన్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా వారికి సహా ఉద్యోగులు, మిత్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రీజియన్ స్థాయిలో కూడా ప్రథమ స్థానంలో నిలిచి, కంపెనీ స్థాయి పోటీలకు ఎంపికై ఓసీ-1 కీర్తిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.












